సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..?

 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా ప్రభాస్ వెండితెరపై కనిపించలేదు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి  సినిమాతో ఈ స్టార్ హీరో ఏకంగా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో డార్లింగ్‏తో సినిమా చేసేందుకు టాలీవుడ్ మాత్రమే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్ రాధేశ్యామ్.. ఆదిపురుష్ చిత్రాలను పూర్తిచేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ , స్పిరిట్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 14న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు కోవిడ్ కారణంగా నిరాశే ఎదురయ్యింది. వేసవిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇదిలా ఉంటే.. ప్రభాస్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యాక్షన్ థ్రిల్లర్ బ్యాగ్రౌండ్‏లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ బారీగా పెరిగిపోయిందట. తెలుగు, కన్నడ, భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. అయితే ముందుగా అనుకున్న దానికంటే సలార్ సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయినట్లుగా వినిపిస్తోంది. ప్రస్తుతం రూ. 200 కోట్లకు పైనే ఈ ప్రాజెక్ట్ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో అత్యధికంగా ప్రభాస్ కే చెల్లించాల్సి వస్తోందట. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలకు ఖర్చు చేయనున్నారట. అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందని టాక్ నడుస్తోంది. కానీ ఆ వార్తలన్ని అసత్యాలే అని తేల్చీ చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తే బడ్జెట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.