దాదాపు160పేజీలతోపాటు పి.హెచ్.డి ఉన్నత చదువు చదివిన సుదర్శన్ రెడ్డి గారిని సన్మానించిన- తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

 
ఆంధ్రప్రదేశ్, గుంటూరు, అతి పురాతన ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా కర్నాటక ప్రాంతానికి బళ్లారికి చెందిన వ్యక్తి దాదాపు160పేజీలతోపాటు పి.హెచ్.డి ఉన్నత చదువు చదివిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్న న్యాయవాది సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ మాట్లాడుతూ కులం జాతి మతం అనేది లేకుండా అందరికీ అందుబాటులో ఉండే చదువును సద్వినియోగం చేసుకోవడం దేవుడిచ్చిన అటువంటి గొప్ప వరం అందులో భాగంగా దేశంలో ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదవడానికి ప్రభుత్వాలు కల్పించినట్టు వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప గొప్ప చదువులు యువత చదవాలని ఉన్నత స్థానంలో ముందంజలో ఉండాలని మనం చదివిన చదువు పదిమందికి ఉపయోగపడేలా ఉండాలని అందులో భాగంగా యువత ఈ దేశానికి వెన్నెముక లాంటిది మరియు ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా వారి వారి ప్రాంతాల్లో వారి వారి యొక్క మేధాశక్తితో వారి యొక్క చుట్టూ పరిసరాల్లో ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్ది ప్రాంతాలను అభివృద్ధి దశలో ముందుకు తీసుకుపోయే విధంగా ముందుండాలని తెలియజేస్తూ ఎక్కడైతే అన్యాయం జరగడానికి , ప్రజలను తప్పుదారి పట్టించడానికి , ప్రజలను మభ్యపెట్టడానికి , ప్రయత్నిస్తున్నటువంటి దుష్టశక్తులను నిర్భయంగా నిలదీసి తరిమికొట్టాలని అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి గొప్ప గొప్ప పనుల కోసం విద్యావంతులు మేధావులు అహర్నిశలు పోరాడి సామాజిక దృక్పథంతో సమసమాజ పునర్నిర్మాణం కోసం ఎప్పుడూ ముందుండాలని తెలియజేశారు.మరియు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్ కర్నాటక ప్రాంతానికి చెందిన సుదర్శన్ రెడ్డి గారి యొక్క ప్రతిభను కర్నాటక ప్రభుత్వానికి తెలిసే విధంగా కర్నాటక ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రా క్రిస్టియన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించిన ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ విద్యార్థులందరూ గొప్ప గొప్ప చదువులు చదివి సమాజ అభివృద్ధికి , ప్రజల శ్రేయస్సు కోసము ఉపయోగపడాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యాలయంలో అధిక సంఖ్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులు పాల్గొన్నారు.