ఇండియాలో జపాన్ ఐదేళ్లపాటు 42 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ ..

 


జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా రెండు రోజుల భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇండియా-జపాన్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన మన దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధమైంది. జపాన్ మీడియా కథనం ప్రకారం ఇండియాలో జపాన్ ఐదేళ్లపాటు 42 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా ఫ్యుమియో ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. దీంతోపాటు 300 బిలియన్ల జపాన్ యెన్లు రుణంగా అందించేందుకు కూడా జపాన్ ప్రతిపాదించనుంది. కర్బన ఉద్గారాల తగ్గింపులో సహకారాన్ని జపాన్ అందించనుంది. మోదీతో సమావేశంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఫ్యుమియో చర్చిస్తారు. జపాన్-ఇండియా వ్యూహాత్మక భాగస్వాములని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడి 70 ఏళ్లు పూర్తవుతున్నాయని ఫ్యుమియో అన్నారు. ఆయన ప్రధానిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత ఇండియా పర్యటనకు రావడం ఇదే తొలిసారి.