5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌ తో ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌...?

 


ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక మొదటగా ఓలా నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మార్కెట్లో విడుదల చేసింది. ఇక తాజాగా ఓలా వాహనదారులకు గుడ్‌న్యూస్ తెలిపారు ఓలా సీఈవో భవీస్‌ అగర్వాల్‌ 

ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద సమస్యగా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్‌ సమయానికి అతి త్వరలో చెకక్ష్‌ పెట్టనున్నట్లుఆ ఆయన వెల్లడించారు. భారత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాల సెగ్మెంట్‌లో ఓలా ఓ సంచలన సృష్టించిందనే చెప్పాలి. ఈవీ స్కూటర్ అందుబాటులోకి తీసుకువచ్చిన ఓలా.. ఇప్పటికే లక్షన్నరకుపైగా బుకింగ్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే బుకింగ్స్‌కు తగ్గట్లుగా కస్టమర్లకు స్కూటర్లను డెలివరీ చేస్తోంది. ఇప్పుడు వాహనాలకు ఛార్జింగ్‌ సమస్యకు చెక్‌ పెడుతూ పరిష్కారం చూపించే ప్రయత్నంలో ఉన్నట్లు


ఇక ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు, ఛార్జీంగ్‌ టెక్నాలజీలో ప్రగతి సాధించిన స్టోర్‌డాట్‌తో భాగస్వామిగా కలుస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో భారత్‌లో ఈవీలకు సంబంధించి సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. 2 వాట్స్‌, 4 వాట్స్‌కు సంబంధించి భారత్‌లోనే తయారీ, ఆర్‌అండ్‌ డీ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.


5 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌


ఓల ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు కేవలం 18 నిమిషాల్లోనే ఛార్జింగ్‌తో 78 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఫుల్‌ ఛార్జింగ్‌కు కనిష్టంగా 4 గంటల 48 నిమిషాల నుంచి గరిష్టంగా 6 గంటల నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక స్టోర్‌డాట్‌ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. అయితే ఇజ్రాయిల్‌కు చెందిన స్టోర్‌డాట్‌ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్‌ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 160 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చని ఓలా సీఈవో తెలిపారు.