రామ్‌ కు జోడీగా రష్మిక మందన్న..?

 


‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఓ సూపర్‌ హిట్‌ అందుకున్నారు రామ్‌. ఇప్పుడు ‘వారియర్‌’గా కనిపించబోతున్నారు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మరోవైపు ‘అఖండ’ విజయంతో సూపర్‌ ఫామ్‌లోకి వచ్చేశారు బోయపాటి శ్రీను. ఇప్పుడు రామ్‌, బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోందని సమాచారం. ఇందులో కథానాయిక రష్మిక పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. రామ్‌, రష్మీక ఇప్పటి వరకూ కలసి నటించలేదు. ఈ జోడీ సెట్టయితే... కొత్త కాంబినేషన్‌ని చూసే అవకాశం దక్కుతుంది. ప్రస్తుతం స్ర్కిప్టు పనుల్లో బిజీగా ఉన్నారు బోయపాటి. ‘వారియర్‌’ పూర్తవ్వగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఈలోగా మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తారు.