ఇండియా సినిమాగా హిస్టరీ సెట్ చేసిన ఆర్.ఆర్.ఆర్ సినిమా..

 


ది మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో టాప్ 3 స్థానాల్లో ఉండే భారీ సినిమాల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన హ్యుజ్ బడ్జెట్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి.ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా నటించిన ఈ బిగ్గెస్ట్ ఏక్షన్ విజువల్ ట్రీట్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది.


మార్చ్ 25 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా అగ్ర దేశం యూఎస్ఏ లో ముందే అంటే మార్చ్ 24న విడుదల అవుతుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పటికే అక్కడ రికార్డు స్థాయి బుకింగ్స్ ని నమోదు చేస్తున్న ఈ సినిమా లేటెస్ట్ గా అక్కడ రికార్డు ఫిగర్ 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనమే నమోదు చేసింది.


దీనితో 13 రోజులు కి ముందే 1 మిలియన్ మార్క్ అందుకున్న ఏకైక ఇండియా సినిమాగా హిస్టరీ సెట్ చేసింది. దీనితో ఈ భారీ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో మరోమారు హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కి ముందే ఇలా ఉంటే రిలీజ్ సమయానికి మరిన్ని మిలియన్స్ ని కొల్లగొడుతుంది అని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. మొత్తానికి అయితే ఈ భారీ సినిమా ఇప్పటి నుంచే వండర్స్ నమోదు చేయడం స్టార్ట్ చేసిందని చెప్పాలి.