తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన..

 


తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొన్న వేళ.. కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని స్పష్టం చేసింది.ఈ మేరకు లోక్ సభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తులు, ధర, డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగానే కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు