భన్సాలీ తో బన్నీ కొత్త సినిమా..?
 పుష్ప’తో బాలీవుడ్‌లోనూ జెండా ఎగరేశారు అల్లు అర్జున్‌. అక్కడ బన్నీ సినిమాలకు ఇప్పుడు విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. ‘పుష్ప 2’ కోసం టాలీవుడ్‌ కంటే బాలీవుడ్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు అల్లు అర్జున్‌తో నేరుగా ఓ హిందీ సినిమా చేయాలని చాలామంది బాలీవుడ్‌ నిర్మాతలు, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. బన్నీ కూడా అందుకు సానుకూలంగానే ఉన్నట్టు సమాచారం. ఇటీవల బన్నీ ముంబై వెళ్లారు. అక్కడ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని కలుసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. లార్జర్‌దాన్‌ లైఫ్‌ కథలకు, భారీ బడ్జెట్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ భన్సాలీ. ఆయన తీసే సినిమాలన్నీ క్లాస్‌ టచ్‌తో ఉంటాయి. అయితే నిర్మాతగా యాక్షన్‌ చిత్రాల్ని ఎంచుకుంటుంటారు. ఆయన నిర్మాణంలోనే బన్నీ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం బన్నీ దృష్టంతా ‘పుష్ప 2’పైనే ఉంది. ఆ తరవాతే తదుపరి ప్రాజెక్టుపై స్పష్టత వస్తుంది.