ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో పలువురు మంత్రులు భేటీ అయ్యారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఢిల్లీలో జరిగిన పరిణామాలను కేసీఆర్‌కు మంత్రులు వివరించనున్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మంత్రులు, ఎంపీలు భేటీ అయ్యారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి హామీ లభించకుండానే మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. ఇప్పటికే ప్రగతి భవన్‌కు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి చేరుకున్నారు.