డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి భారతీయ చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్’...

 ఇంకో పన్నెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో సందడి చేయబోబోతోంది రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ . తారక్, చెర్రీలు మొట్టమొదటి సారిగా హీరోలుగా స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆసక్తిగా నెలకొంది. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, తమిళ విలక్షణ నటుడు సముద్రఖని, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెలోడీ మాస్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇది వరకు విడుదలైన ఈ సినిమా టీజర్స్, సింగిల్స్, ట్రైలర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం జక్కన్న అండ్ టీమ్ .. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాతో ప్రేక్షకులకు దశ్య, శ్రవణ పరంగా మంచి అనుభూతిని ఇవ్వడానికి ‘డాల్బీ సినిమా’ టెక్నాలజీని వాడబోతున్నారు. డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి భారతీయ చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్’ నిలవబోతోంది. 


ఓవర్సీస్ లో ఐమ్యాక్స్ లాంటి పెద్ద ఫార్మేట్స్ లో చిత్రాన్ని ప్రీమియర్ షో గా ప్రదర్శించడానికి ఈ ‘డాల్బీ సినిమా’ టెక్నాలజీని వాడతారు. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంపై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాని ప్రపంచంలోనే అతి పెద్ద తెర ఉన్న యూకేలో ఈ సినిమా ప్రీమియర్ షోను ప్రదర్శిస్తున్నారు. ఈ తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో సినిమాను ప్రదర్శిస్తూండడం విశేషమని చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతినివ్వబోతుందో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే.