మరోసారి మహేశ్ బాబు మేనియా..

 


మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్‌ కథానాయిక. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ రెండు పాటలు విడుదలయ్యాయి. తొలి గీతం ‘కమాన్‌ కమాన్‌ కళావతీ..’ శ్రోతలను ఆకట్టుకుంది. బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో పాట వచ్చింది. ‘పెన్నీ’ అంటూ సాగే ఈ పాటలో హీరో క్యారెక్టరైజేషన్‌ని పరిచయం చేశారు. మహేష్‌ కుమార్తె సితారతో ఓ వీడియో సాంగ్‌ రూపొందించి విడుదల చేయడంతో ఈ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. తొలి 24 గంటల్లో ఏకంగా 18 మిలియన్‌ వ్యూస్‌ని సొంతం చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఓ పాటకు తొలి రోజే ఇన్ని వ్యూస్‌ రావడం టాలీవుడ్‌లో రికార్డని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మే 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.