గూగుల్ లో కొత్త ఫీచర్​..

 


సెర్చింజన్​ దిగ్గజం గూగుల్(Google) తన ఆండ్రాయిడ్​ యూజర్లకు(Android Users) అదిరిపోయే శుభవార్త చెప్పింది. గూగుల్ లేటెస్ట్ అప్​డేట్​లో 'లాస్ట్ 15 మినెట్స్( Last Fifteen Minutes)​' పేరుతో ఓ కొత్త ఫీచర్​ను(New Feature) పరిచయం చేయనున్నట్లు తెలిపింది.


ఆండ్రాయిడ్​ యూజర్లు తమ సెర్చ్​ హిస్టరీలోని చివరి 15 నిమిషాల హిస్టరీని డిలీట్​ చేసుకునేలా కొత్త అప్​డేట్​ను(Update) తీసుకురానుంది. ఈ మేరకు గూగుల్ తన 2021 I/O కాన్ఫరెన్స్‌లో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే, ఈ లేటెస్ట్ అప్​డేట్​ను​ ఐఓఎస్(IOS)​ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. అతి త్వరలోనే ఆండ్రాయిడ్​ యూజర్లకు సైతం పరిచయం చేయనున్నట్లు గూగుల్ వెల్లడించింది.

కాగా, ఈ ఫీచర్​ను గతేడాది జులైలోనే పరిచయం చేయాలని గూగుల్​ తొలుత భావించినప్పటికీ.. సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైనట్లు సమాచారం. ప్రస్తుతం, కొద్ది మంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్​ అందుబాటులో ఉందని, త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్లకు పరిచయం చేస్తామని పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ డెస్క్​టాప్ వెర్షన్​లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై గూగుల్ స్పష్టతనివ్వలేదు.

కాగా, ప్రస్తుతం గూగుల్​లో గంట, ఒక రోజు, వారం, నెలా లేదా మొత్తం హిస్టరీని మాన్యువల్​గా డిలీట్ చేసుకునే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇటీవల 3 నెలలు, 18 నెలలు లేదా 36 నెలల ఓల్డ్​ హిస్టరీని ఆటోమేటిక్​గా క్లియర్​ చేసే ఆప్షన్​ను సైతం గూగుల్ చేర్చింది. ఇప్పుడు, కొత్తగా 15 నిమిషాల ఓల్ట్ హిస్టరీని కూడా డిలీట్ చేసే అప్​డేట్​ను అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్లు డిఫాల్ట్ గూగుల్ సెర్చ్ యాప్​లోని పాప్ అప్ మెనూ ఓపెన్ చేయగానే అక్కడ చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీని తొలగించే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్​ చేస్తే చివరి 15 నిమిషాలకు సంబంధించిన హిస్టరీ క్లియర్​ అయిపోతుంది.
గతేడాదే ఐఓఎస్​ యూజర్లకు పరిచయం..

ఈ ఫీచర్​ కోసం యూజర్లు ఆండ్రాయిడ్​ ఫోన్లలో గూగుల్ యాప్​ ఓపెన్​ చేసి ప్రొఫైల్ పిక్చర్​ ఐకాన్​పై క్లిక్​ చేయాలి. తర్వాత అకౌంట్​ సెట్టింగ్స్ మెనూ ఓపెన్​ అవుతుంది. అందులో సెర్చ్ హిస్టరీ కింద 'డిలీట్ లాస్ట్ 15 మినెట్స్' అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే చివరి 15 నిమిషాలకు సంబంధించిన మీ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం డిలీట్ అవుతుంది. కాగా, ఈ ఏడాది మే 11, 12 తేదీల్లో గూగుల్ యాన్యువల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ కాన్ఫనెన్స్​లో గూగుల్ పరిచయం చేయబోయే పలు కీలక ఫీచర్ల గురించి ప్రకటన చేయనున్నట్లు సమాచారం.