డిసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న రాధే శ్యామ్ సినిమా... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం మూడు రోజుల క్రితం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైన సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 72కోట్లకు పైగానే వసూళ్ళను రాబట్టింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ వసూళ్ళను రాబడుతోంది. మూడో రోజు సైతం అదే జోరు కొనసాగిస్తుండడంతో ఫుల్ రన్ లో భారీ కలెక్షన్స్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. 


అయితే ఈ సినిమాకి బాలీవుడ్ లో మాత్రం బ్రేక్ పడిందని తెలుస్తోంది. తొలి రోజు అక్కడ రూ. 4.5కోట్లు కలెక్ట్ చేయగా.. రెండో రోజు రూ. 5కోట్లు కలెక్ట్ చేసిందని రిపోర్ట్స్ వచ్చాయి. మొత్తానికి రెండు రోజుల్లో రాధేశ్యామ్ బాలీవుడ్ లో రూ. 9.5కోట్లు కలెక్ట్ చేసిందని టాక్. అయితే ఈ సినిమాకి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో టఫ్ కాంపిటీషన్ ఎదురైంది. ఈ సినిమాకి మొదటి రోజు కలెక్షన్స్ కన్నా రెండో రోజు 145 % ఆక్యుపెన్సీ లభించిందని సమాచారం. 1990 లో కాశ్మీర్ లోని హిందువుల ఊచకోత నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి సర్వత్ర ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకి థియేటర్స్, పబ్లిసిటీ తక్కువైనప్పటికీ బాలీవుడ్ లో మంచి మైలేజ్ దక్కింది. అందుకే ‘రాధేశ్యామ్’ చిత్రం అక్కడ అంతగా ప్రభావం చూపించలేకపోయిందని ట్రేడ్ రిపోర్ట్.