మరో మాసీవ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేశ్ బాబు..?

 సూపర్ స్టార్ మహేశ్‌ బాబు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే అంటూన్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మాసీవ్ మూవీస్‌లని యాక్షన్ ప్యాక్డ్‌ చిత్రాలని చేస్తున్నారు. త్వరలో మహేశ్‌ కూడా అదే తరహా మూవీ చేయలాని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం మహేశ్‌ ‘సర్కారువారి పాట’మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సాంగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మరింత స్టైలిష్‌గా మహేశ్‌ కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. `పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నాయని మహేశ్‌ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


ఈ మూవీ తరువాత మహేశ్‌ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత రాజమౌళితో ఓ భారీ మూవీకి మహేశ్‌ శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

రాజమౌళి మూవీ తరువాత మహేశ్‌ ఓ మాసీవ్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఊర మాస్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా అయిన బోయపాటి ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వుందని ఫీల్మ్‌నగర్‌ టాక్‌ వినిపిస్తుంది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి మహేశ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు