తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఈ సమాజానికి అవసరం - తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణగౌడ్.

 
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కమిటీ అధ్యక్షులుగా భాస్కర్ గారిని ఉపాధ్యక్షులుగా మోహిన్ గారిని గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షులు దొడ్ల వెంకట్ గారు నియమించారు. తదనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం ముప్పై మూడు జిల్లాల్లో విస్తృతంగా శరవేగంగా ముందుకు వెళ్లడం అభినందించదగ్గ విషయమని అందులో భాగంగా మహిళలు ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలియజేస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో సగభాగం అయినటువంటి మహిళలు ఉత్తేజవంతంగా పని చేస్తే ఈ యొక్క సమాజం బాగుపడుతుందని తెలియజేశారు అదే విధంగా మహిళలకు ముందుముందు ఉన్నతమైన అవకాశాలు తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫారంలో కల్పిస్తామని తెలియజేశారు. మరియు ప్రతి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ శరవేగంగా సమస్యల పట్ల దృష్టి పెట్టి అట్టి సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ తెలంగాణ గ్రాడ్యేట్ ఫారం ముందుంటుందని అవసరమైతే గల్లీ నుండి ఢిల్లీ వరకు సమస్యల పరిష్కార సాధనకు వెనుకడుగు వేయకుండా రాజ్యాంగ బద్ధంగా ప్రతి సమస్యను పటిష్టాత్మకంగా పరిష్కరిస్తుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మెన్ వెంకట్ రెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండీ ఫయాజ్, స్పోక్ పర్సన్ కోడూరి శ్రీకాంత్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు బస్వరాజ్ పాటిల్, రాష్ట్ర నాయకులు సోమేష్, రాష్ట్ర కార్యదర్శి ప్రతాప్ మరియు నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.