గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీని ఏర్పాటు చేస్తామని తెలిపిన సీఎం జగన్‌ ...

 


గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు. సీఎం జగన్‌ను గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ షేక్‌ సాదియా అల్మస్‌ కలిశారు.

గత డిసెంబర్‌ ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణాలు, ఒక రజత పతకం సాధించింది. షేక్‌ సాదియాకు ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయం సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్‌ వెల్లడించారు.