జర్మన్ ఓపెన్‌లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ జోరు కొనసాగుతోంది. టోర్నీ టాప్ సీడ్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్ సెన్కు షాకిచ్చి లక్ష్యసేన్ సింగిల్స్ ఫైనల్‌కు దూసు కుపోయాడు. శనివారం ఆఖరి పాయింట్ వరకు హోరాహోరీగా జరిగిన సెమీ్‌సలో 20 ఏళ్ల సేన్ 21-13, 12-21, 22-20తో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ నెంబర్‌వన్ షట్లర్ విక్టర్‌ను కంగుతినిపించాడు. విక్టర్‌పై నెగ్గడం లక్ష్యకిదే తొలిసారి. ఆదివారం జరిగే ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన కునల్వత్ విదిత్ శరణ్‌తో లక్ష్య అమీతుమీ తేల్చుకుం టాడు. మరో సెమీ్‌సలో విదిత్ శరణ్ 21-13, 21-12తో లీ జీ జియా (మలేసియా)పై నెగ్గాడు.