కేజీయఫ్ నుండి రాబోతున్న తూఫాన్..

 


'కేజీయఫ్ చాఫ్టర్ 2' మూవీ నుంచి తాజాగా క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన సినిమా ఇది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. 'కేజీఎఫ్ చాప్టర్ 1'తో భారీ హిట్ అందుకున్న యష్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ సీక్వెల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలతో పాటు టీజర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. యూట్యూబ్‌లో ఈ మూవీ టీజర్ రికార్డ్ స్థాయిలో వ్యూస్ రాబట్టింది.


కాగా, ఇప్పుడు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ 'తూఫాన్' రాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సాంగ్‌ను మార్చి 21న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. భారీ అంచనాలు ఏర్పడిన 'కేజీఎఫ్ 2' నుంచి రాబోతున్న ఈ 'తూఫాన్' సాంగ్ ఏ మేరకు ఆకట్టుకుందో చూడాలి. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. రవి బాసృర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.