రూమర్ కు చెక్ పెట్టిన రాజమౌళి..

 


గత కొద్ది రోజులుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతున్న బిగ్గెస్ట్ రూమర్ కు చెక్ పెట్టాడు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు.ఈ మూవీలో మరోసారి ఇద్దరు హీరోల ఫార్ములా ను రాజమౌళి కంటిన్యూ చేస్తున్నాడని ప్రచారం సాగింది. ఒకసారి చియాన్ విక్రమ్ పేరు వినిపించింది.మరో సారి అఖండ బాలయ్య పేరు తెరపైకి వచ్చింది.అయితే ఈ వార్తల్లో నిజం లేదని, మహేశ్‌తో తీయబోయే మూవీలో సోలో హీరో ఉంటాడని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో జక్కన్న ఈ విషయం చెప్పాడు.


ఆర్‌ఆర్‌ఆర్‌ రిలీజ్‌ తర్వాత రాజమౌళి హాలీడ్‌ ట్రిప్‌కి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ట్రిప్‌ తర్వాత మహేశ్‌తో చేయాల్సిన సినిమాపై రాజమౌళి దృష్టిపెట్టనున్నాడు. ఈ లోపు మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాను స్టార్ట్‌ చేస్తాడు. ఆ తర్వాత జక్కన్న మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. మహేశ్‌తో చేయాల్సిన మూవీని పూర్తిగా ఆఫ్రికన్ జంగిల్ నేపథ్యంలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతే కాదు బాహుబలి సిరీస్ తర్వాత పూర్తిగా గ్రాఫిక్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. ఆర్‌ఆర్‌ఆర్‌ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి రాజమౌళి న్యూ మూవీలో నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.