ఏపీ అసెంబ్లీలో పేదలకు పక్కాఇళ్ల నిర్మాణంపై సీఎం జగన్‌ ప్రకటన..

  


ఏపీ అసెంబ్లీలో పేదలకు పక్కాఇళ్ల నిర్మాణంపై చర్చించారు. ప్రతీ ఎమ్మెల్యే గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని తెలిపారు. 17 లక్షల 60 వేల పక్కా ఇళ్ల నిర్మాణాలు చేపడుతామని పేర్కొన్నారు. 17వేల కాలనీలను ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. 30 లక్షల 76 వేల మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్‌ ప్రకటించారు.