మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి శాఖలన్నింటినీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ...

 


ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి శాఖలన్నింటినీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డికి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాలు, వాణిజ్య పన్నుల శాఖలను బుగ్గన నిర్వహిస్తున్నారు. వీటితో పాటు అదనంగా ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం, నైపుణ్య శిక్షణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖలను కూడా బుగ్గనకు అప్పగిస్తూ గవర్నర్‌‌కు సీఎం ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించి కొద్దిసేపటి క్రితం గవర్నర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు.