టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు హైకోర్టు బెయిల్ మంజూరు..

 


టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు హైకోర్టులో ఊరట లభించింది. వనమా రాఘవకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వనమా రాఘవ లైంగిక వేధింపులకు భయపడి ఓ కుటుంబమే ఆత్మహత్యకు పాల్పడింది. వనమా రాఘవ 61 రోజుల పాటు జైల్లో ఉన్నారు. కొత్తగూడెం నియోజక వర్గంలో అడుగు పెట్టకుండా ఉండాలని షరతు విధించారు. ప్రతి శనివారం ఖమ్మం వన్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టాలని హైకోర్టు షరతు విధించింది.