ఈనెల 17వ తెలంగాణ అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

 


తెలంగాణ అసెంబ్లీ  హామీల కమిటీ సమావేశం ఈనెల 17వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు.ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీహాల్ లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ శాఖ తరపున ప్రభుత్వం ఇచ్చిన హామీల అమతు తీరుపై ఈ సమావేశంలో చర్చ జరగుతుందని అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు.