నేటి నుండి జంట నగరాల్లో18 హాస్పిటల్స్ లో 5 రూపాయల భోజనం..

 జంట నగరాల్లో18 హాస్పిటల్స్ లలో ఇవాళ్టి నుంచి 5 రూపాయిల మీల్స్ ప్రారంభిస్తున్నామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ… ఒక్కొప్పుడు దవాఖాన అంటే గాంధీ, ఉస్మానియా అని. బస్తీ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో బస్తీ దవాఖానలు సీఎం కేసీఆర్ గారు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.


 


350 బస్తీ ధవాఖానలు ప్రారంభించారని.. ఏ దవాఖాన కు వెళ్లిన వైద్యలు రక్త పరీక్షలు చేయాలని అంటారు,అందుకోసమే తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలు ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. 20 రేడియోలజీ ల్యాబ్స్ ని అందుబాటులోకి తెచ్చుకున్నామని. ఎక్స్ రే, 2 డి ఎకో ,అల్ట్రా సౌండ్,ఈ సి జీ లాంటి పరీక్షలు చేస్తామని స్పష్టంచేశారు. డయాగ్నోస్టిక్ యాప్ ని అందుబాటులోకి తీసుకొచ్చాము, గూగుల్ మ్యాప్ ద్వారా ఆ కేంద్రానికి వెళ్ళవచ్చు.. ఈ యాప్ లో పాత రికార్డ్స్ ని కూడా చూడవచ్చు ,పేషెంట్ హిస్టరీ కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.