తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈనెల 18న భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై సీఎంకు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. కాగా అదే రోజు ప్రగతి భవన్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం ప్రశాంత్ కిషోర్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం