2023 మేలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు -- ఉత్తమ్ కుమార్ రెడ్డి..

 


2023 మేలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడం ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి జోస్యం చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను సీఎం కేసీఆర్‌ పరామర్శించ లేదని తప్పుబట్టారు. కానీ.. పంజాబ్ రైతులకు నగదు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు లూటీ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.