ఈ నెల 26 నుంచి ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు 'బస్సు యాత్ర'

 


ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ నెల 26 నుంచి 'బస్సు యాత్ర' చేపట్టనున్నారు.అందులో భాగంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రులు రాజన్నదొర, మెరుగు నాగార్జున, మాజీ మంత్రి అవంతి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో 26 తేదీన బస్సు యాత్ర ప్రారంభమై 29న అనంతపురంలో ముగుస్తుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి రాజన్న మాట్లాడుతూ.. సీఎం దావోస్ పర్యటనను సైతం టీడీపీ నాయకులు రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు మంత్రులు బస్సు యాత్ర, సామాజిక న్యాయ భేరి పోస్టర్లను విడుదల చేశారు