టీడీపీ పోలిట్బ్యూరో సమావేశం ఈ నెల 26న జరగనుంది. 27వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహానాడులో ఆమోదించాల్సిన తీర్మానాలపై ఇందులో చర్చించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ఇతర అంశాలపై చర్చిస్తారు. అలాగే రానున్న ఎన్నికల్లో యువత, మహిళలకు పెద్ద పీట, ఇతర అంశాలపై కూడా చర్చిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.