ఏపీ లో ఈ నెల 29న పాలిసెట్ పరీక్ష డేట్ ...

 


ఆంధ్రప్రదేశ్ లో పాలిసెట్ పరీక్షలను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ పరీక్షను ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ పరీక్షకు 1.37 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 404 సెంటర్లలో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశామని చెప్పారు. అభ్యర్థులను ఉదయం 10 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశారు. పది రోజుల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తామని తెలిపారు. మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.