ఎన్టీఆర్ 30వ సినిమా కీలక మార్పులు..

 


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ ది ఒక్కడిదే కాదు.. కాబట్టి ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.


మరి ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. మొన్న బర్త్ డే జరుపుకున్న నేపథ్యంలో NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు. ఆచార్య ప్లాప్ ను ఈ సినిమా హిట్ తో తుడిచి పెట్టుకు పోవాలని చాలా కష్టపడుతున్నాడు కొరటాల.పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కథ పై మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యిందట.. ఈ స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ కూడా పాల్గొంటున్నారట.. ఎన్టీఆర్ కు స్క్రిప్ట్ విషయంలో మంచి పట్టు ఉంది అనే విషయం తెలిసిందే..


కథ మలుపుల దగ్గర నుండి ఎమోషన్ వరకు అన్ని విషయాల్లో ఎన్టీఆర్ సలహాలు సూచనలు ఇస్తున్నాడట. ఎన్టీఆర్ చెప్పిన దానికి తగినట్టు కొరటాల కూడా కథలో కీలక మార్పులు చేస్తున్నాడని సమాచారం.. మరి అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వీరి కాంబోలో మరో సూపర్ హిట్ సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.