5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించనున్న మోడి..

 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు. TRAI సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా మంగళవారం ప్రధాని మోడీ 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) రజతోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ఇది దేశంలోని టెలికాం పరిశ్రమ .. స్టార్టప్‌లకు మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. దీంతోపాటు ఐదవ తరంలో ఉత్పత్తులు, నమూనాలు .. పరిష్కారాలను ధృవీకరిస్తుందన్నారు. స్వీయ-నిర్మిత 5G టెస్ట్ బెడ్‌ను దేశానికి అంకితం చేసే అవకాశం తనకు లభించడం గర్వకారణమన్నారు. టెలికాం రంగంలో క్లిష్టమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ-విశ్వాసం దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని మోదీ అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధానమైన సిబ్బందికి, IITలకు మోడీ అభినందనలు తెలియజేశారు.


క్లిష్టమైన, ఆధునిక సాంకేతికతల దిశలో స్వావలంబన కోసం 5G టెస్ట్‌బెడ్ ఒక ముఖ్యమైన దశ అని మోడీ అభివర్ణించారు. 5G టెక్నాలజీని తయారు చేసేందుకు టెస్టింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని మోడీ యువకులు, పరిశోధకులు, కంపెనీలకు సూచించారు. స్టార్టప్‌లు, పరిశ్రమలు తమ ఉత్పత్తులను స్థానికంగా పరీక్షించడానికి.. ధృవీకరించడానికి అదేవిధంగా విదేశీ సౌకర్యాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశంలోని మొదటి 5G టెస్ట్‌బెడ్‌ను ప్రారంభించడం జరిగింది.