తెలంగాణలో 5వ విడత పల్లె ప్రగతి విజయవంతం చేయాలి --: ఎర్రబెల్లి దయాకర్ రావు

 


తెలంగాణలో 5వ విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర పల్లెలు బాగు పడుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో ఉందని అందుకు తగినట్టుగా ప్రగతి మరింత మెరుగు పెడుతూ అభివృద్ధిని పరుగులు పెట్టించాలని, ఇందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినయోగం చేసుకోవాలన్నారు. సీఎం కేసిఆర్ ఆదేశానుసారం పల్లె ప్రగతిని విజయవంతం చేసే బాధ్యతను ప్రజా ప్రతినిధులు, అధికారులు తీసుకోవాలన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుండి చేపట్టనున్న 5వ విడత పల్లె ప్రగతి, నాలుగో విడత పట్టణ ప్రగతి సన్నాహక సమీక్ష సమావేశాన్ని మంత్రి జనగామ కలెక్టరేట్ లో శనివారం నిర్వహించారు.