తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

  తెలంగాణలోని 8 జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వానలు పడే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రాష్ట్రంలో రేపు కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కాగా, వడదెబ్బ కారణంగా నిన్న వనపర్తి జిల్లాలో ఒకరు, కుమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో ఒకరు మరణించారు.