సర్కారు వారి పాట మూవీ ఈ నెల రెండో వారంలో విడుదలై.. విజయవంతంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే..ఈ సర్కారు వారి పాట సినిమాపై టీవీ 9 ఛానెల్ నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టింది.
రాధేశ్యామ్, ఆచార్య సినిమాల లాగే… సర్కారు వారి పాట కూడా అట్టర్ ఫ్లాప్ అయినట్లు స్పెషల్ స్టోరీలు వేసింది టీవీ 9 ఛానెల్. అసలు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కలెక్షన్స్ లేవంటూ మహేష్ బాబు పరువు తీసే ప్రయత్నం చేశార
దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ టీవీ 9 ఛానెల్ పై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో #BANTV9 #***ANJODUKATV9 అంటూ రకరకాల హ్యాష్ ట్యాగ్ తో.. ఆ ఛానెల్ పై అమ్మనా బూతులు తిడుతున్నారు. ముఖ్యంగా టీవీ9 ఛానెల్ లోని.. ప్రముఖ యాంకర్లను టార్గెట్ చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్. అలాగే.. తమ హీరోకు టీవీ 9 యాజమాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. అయితే.. ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. టీవీ9 కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. కాగా.. సర్కారు వారి పాట సినిమా ఇప్పటి వరకు రూ. 123 కోట్లు రాబట్టినట్లు సమాచారం.