తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు

 


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన పై ఈటెల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు పొలిటికల్ టూరిస్ట్ ఎవరో టీఆర్ఎస్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేదన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే.‌. కేసీఆర్‌కు పడుతోందన్నారు. మంత్రులు పిచ్చి ప్రేలాపనలు ఆపి వారి శాఖలపై పట్టు సాధించాలని సూచించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్నారు. ఏ రాష్ట్రంలోనైనా పర్యటించే అధికారం జాతీయ పార్టీలకుంటుదని, తనకంటే జూనియర్.. కేజ్రీవాల్ కమిట్మెంట్ చూసి కేసీఆర్ నేర్చుకోవాలన్నారు.