మహేష్, త్రివిక్రమ్ సినిమా నుండి క్రేజీ అప్డేట్...?

 


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట. డైరెక్టర్ పరుశురామ్.. మహేష్.. కీర్తి కాంబోలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా ప్రారంభించారు.. కానీ ఇప్పటివరకు ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాలేదు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.