ట్రాఫిక్ చలాన్ విషయంలో ఇక పై కొత్త టెక్నాలజీ..

 


ట్రాఫిక్ చలాన్ విషయంలో హైదరాబాద్ పోలీసులు నూతన టెక్నాలజీ వాడాలని నిర్ణయించారు. దీని ప్రకారం వాహనదారులకు తమ వెహికల్ కు సంబంధించిన చాలాన్ల అప్ డేట్ నేరుగా వాట్సాప్ కు పంపేందుకు సిద్ధమైంది. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో వాహనదారులు తమ చిరునామా, ఫోన్ నంబర్ వంటి వివరాలను అందిస్తారు. ఇందులోని మెుబైల్ నంబర్ కు ఈ-చలాన్ వివరాలను పోలీసులు ఇకపై పంపుతారు. సాధారణంగా గతంలో వాహనదారులు ఈ వివరాలు తెలుసుకోవటానికి పోలీసు ఈ-చలాన్ పోర్టల్ లో చెక్ చేసుకోవలసి వచ్చేంది. ఇప్పుడు నేరుగా ఆ వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకుంటే.. చలానాలు పెండింగ్ లేకుండా వెంటనే చెల్లించవచ్చు. ఈ చెల్లింపులను ఆన్ లైన్లో, ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్ లో, మీ సేవలో చెల్లించేందుకు వెసులుబాటు ఉంది. వాహన యజమానులందరికీ ఈ- మెయిల్ ఉండకపోవటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.