నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన...

 


తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నేటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడుల సాధన లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగించనున్నారు.విదేశీ పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ అవుతారు. ఆ తర్వాత ఆయన స్విట్జర్లాండ్ కు వెళ్తారు. దావోస్ లో ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు.
ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో కేటీఆర్ సమావేశం కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. 26న తిరిగి రాష్ట్రానికి వస్తారు. కేటీఆర్ తో పాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇతర అధికారుల బృందం పర్యటనలో పాల్గొంటుంది. సుమారు పది రోజుల పాటు మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన సాగనుంది. విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి తొలుత లండన్ వెళ్లనున్న మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి దావోస్ పయనమవుతారు