ప్రభాస్ స్పిరిట్ లో హీరోయిన్ ఫిక్స్..?
ఇటీవల పూజా హెగ్డేతో కలిసి ‘రాధే శ్యామ్’లో కనిపించిన ప్రభాస్.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం ‘ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అలాగే ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్' అనే సినిమాలోనూ ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి కీలక అప్ డేట్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ జోడీగా ఇద్దరు టాప్ హీరోయిన్లలో ఎవరిని ఫైనల్ చేయనున్నారో తెలియాల్సి ఉంది. కాగా, ఈ రాబోయే థ్రిల్లర్ డ్రామా ‘స్పిరిట్’లో రష్మిక మందన్న లేదా కియారా అద్వానీ జతకట్టనున్నారు.