నేడు టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం..

  


 టీపీసీసీ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం సోమవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్‌ లో జరగనుంది. ఈ భేటీకి సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య అనుబంధ సంఘాల ఛైర్మన్‌లను ఆహ్వానించారు.ఈ సమావేశంలో ప్రధానంగా రైతు డిక్లరేషన్‌తో జనంలోకి వెళ్ళే కార్యాచరణపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. అలాగే పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ నేతలు పల్లెబాట పట్టనున్నారు. 300 మంది నాయకులతో డిక్లరేషన్‌పై జనంలోకి వెళ్లనున్నారు. ఒక్కో నాయకుడికి 30-40 గ్రామాల బాధ్యత అప్పగించే ఆలోచనలో టీకాంగ్రెస్ (T.Congress) ఉన్నట్లు తెలియవచ్చింది.


కాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ పెళ్లి విందులో డాన్స్ చేసి అలరించారు. ఆదివారం రాత్రి సంగారెడ్డి పట్టణంలోని ఓ ఫంక్షన్ హల్‌లో జరిగిన రిసెప్షన్‌కు ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వధూవరులు, బంధువులతో కలిసి స్టెప్స్ వేశారు. జగ్గారెడ్డి డాన్స్ చూసి పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యానికి లోనయ్యారు.