కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు..?

 


కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు రేవంత్ రెడ్డి రేయిపగలు కష్టపడుతున్నారు. రీసెంట్ గా వరంగల్ లో రాహుల్ సభ సక్సెస్ కావడం తో కార్య కర్తల్లో కొత్త ఉత్సహం నిండింది.ఇదే క్రమంలో ఇతర పార్టీల నేతలు సైతం కాంగ్రెస్ గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు.అధికార టీఆర్‌ఎస్‌ ను విడి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు తెలుస్తుంది.


నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మితో పాటు కుటుంబసభ్యులు, మరో ప్రజాప్రతినిధి దేశ రాజధాని ఢిల్లీ లోనే ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ రాహుల్‌ గాంధీతో కలిసిన అనంతరం.. రేపు కాంగ్రెస్‌ పార్టీ చేరతారని సమాచారం అందుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా.మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చెన్నూర్‌ ఎమ్మెల్యేగా.. టీఆర్ఎస్‌ పార్టీ తరఫున నల్లాల ఓదెలు గెలిచారు. అయితే. 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం.. నల్లాల ఓదెలుకు కాకుండా.. బాల్క సుమన్‌ కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు