రామ్‌చరణ్‌,శంకర్‌ సినిమా లో ఆర్. ఆర్.ఆర్...?

 


రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌  దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ తాజాగా విశాఖపట్నంలో ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి నెట్టింట నిత్యం ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంది. ఇందులో రామ్‌ చరణ్‌ డ్యూయల్‌ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తండ్రీకొడుకులు పాత్రల్లో చెర్రీ నటించనున్నాడని నెట్టింట వార్తలు వైరల్‌ అయ్యాయి. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చెర్రీ డ్యూయల్‌ రోల్‌లో కాదని ఏకంగా ట్రిపుల్‌ రోల్‌లో నటించనున్నాడనేది సదరు వార్తల సారాంశం. తండ్రితో పాటు ఇద్దరు కొడుకుల పాత్రల్లో రామ్‌ చరణ్‌ నటించనున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


ఇందులో ఒకటి నెగిటివ్‌ రోల్‌ కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే చెర్రీ ‘నాయక్‌’ సినిమాలో డ్యూయల్‌ రోల్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే ట్రిపుల్‌ రోల్‌లో కనిపించడం ఇది తొలిసారి అవుతుంది. మరి ఈ వార్తలో నిజం ఉందా.? లేదా గాసిప్‌ రాయుళ్లు పుట్టించిన వట్టి పుకారేనా తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.