మంకీపాక్స్‌ తో ముప్పు --:డబ్ల్యూహెచ్‌వో

 


ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదయ్యాయని, మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది.కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. త్వరలోనే భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.