జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పారిశుద్ద్య కార్మికులు ఆందోళన

 


 జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద పారిశుద్ద్య కార్మికులు ఆందోళనకు దిగారు. కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు బయోమెట్రిక్ విధానం రద్దు చేయాలని నిరసన చేపట్టారు.కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిరసన తెలిపారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు.