భారత్‌ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ చక్కర్లు..

 


భారత్‌- పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఓ డ్రోన్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత భద్రతా బలగాలు వెంటనే దాన్ని కుప్పకూల్చాయి.''పాకిస్థాన్ సరిహద్దుల నుంచి కథువా జిల్లా రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లి హరియా చెక్ వద్దకు దూసుకొచ్చిన ఓ డ్రోన్‌ను కూల్చేశాం. డ్రోన్‌లో పలు పదార్థాలు ఉన్నాయి. ఆ డ్రోనును బాంబు స్క్వాడ్‌కు చెందిన నిపుణులు పరిశీలిస్తున్నారు'' అని జమ్మూకశ్మీర్ పోలీసులు మీడియాకు తెలిపారు.

 అనుమానాలు నెలకొన్నాయి. భారత భూభాగంలోకి పాకిస్థాన్‌ డ్రోన్లు పంపుతున్న ఘటనలు కొంత కాలంగా పెరిగిపోయాయి. జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ పేలుడు పదార్థాల వంటివి పంపుతూ ప్రోత్సహిస్తోంది. డ్రోన్లపై నిఘా పెంచిన భారత బలగాలు వాటిని వెంటనే కూల్చేస్తున్నాయి