ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం మరో బాలీవుడ్ నటిని మేకర్స్ తీసుకున్నారు. బాలీవుడ్ అందాల తార దిశాపటానీ ప్రాజెక్ట్కేలో నటించనుంది. ఈ విషయాన్ని దిశాపటానీ తానే స్వయంగా తెలిపింది.
చిత్ర యూనిట్ ‘ప్రాజెక్ట్ కె’లోకి ఆహ్వానిస్తూ ఇచ్చిన పుష్పగుచ్చం ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దిశా.. ‘భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, ప్రభాస్ సినిమాలో నటించడం ఎందో ఆనందంగా ఉంది’ అంటూ కామెంట్ చేసింది. ఇదిలా ఉంటే సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.