ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ..

 


ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20న స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు.


మే 22, 23, 24 తేదీల్లో దావోస్ సదస్సుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. దావోస్ లో విదేశీ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో జగన్ భేటీ కానున్నారు. ఈ నెల 31న తిరిగి ఏపీకి రానున్నారు