ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ షెడ్యూల్ లో మార్పు..

 


ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాద్ రానున్న సంగతి తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన పర్యటన షెడ్యూల్ మారింది.

మధ్యాహ్నం 1.30 గంటలకు రావాల్సిన ప్రధాని మోడీ 40 నిమిషాలు ముందుగానే అంటే 12.50 గంటలకే హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ 15నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలతో ప్రధాని సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అలాగే ప్రజలను ఉద్దేశించిన ఆయన ప్రసంగిస్తారని సమాచారం.