బిగ్‌బాస్‌' ఓటీటీషోలో విన్నర్‌గా బిందు మాధవి..

 


'బిగ్‌బాస్‌' ఓటీటీ (Bigboss ott)షోలో బిందు మాధవి విన్నర్‌గా నిలిచారు. శనివారం జరిగిన గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌లో నాగార్జున ఆమెను విజేతగా ప్రకటించారు.బిందుకి గట్టి పోటీ ఇచ్చిన అఖిల్‌ రన్నర్‌గా నిలిచారు. మస్తీ హ్యాష్‌ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చి ఆడపులి అనే హ్యాష్‌ట్యాగ్‌తో విన్నర్‌గా బయటికెళ్లారు బిందు. విజేతగా ఆమె రూ.40 లక్షలు ప్రైజ్‌ మనీ అందుకున్నారు. నిజానికి ఆమెకు ప్రైజ్‌ మనీ రూ. 50 లక్షలు దక్కాలి. ఆరియానా ముందుగానే హౌస్‌ నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఆమెకు అందిన రూ.10 లక్షలను అసలు ప్రైజ్‌మనీలో తగ్గించారు.గంట ఎపిసోడ్‌ కోసం రోజంతా ఎదురుచూస్తున్న ఆడియన్స్‌ కోసం బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ పేరుతో ఓటీటీలో ఈ షోను ప్రవేశపెట్టారు తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో లేడీ విన్నర్‌గా బిందు అరుదైన రికార్డ్‌ సృష్టించారు. విన్నర్‌ అయిన బిందు మాధవి వేదికపై భావోద్వేగానికి లోనయ్యారు. ''కొందరికి ఎంత కష్టపడినా సక్సెస్‌ రావడానికి ఏళ్లు పడుతుంది. కొంతమందికి ఇట్టే సక్సెస్‌ వరిస్తుంది. అలా ఆలస్యంగా విజయాన్ని అందుకునే లేట్‌ బ్లూమర్స్‌కు నా గెలుపు అంకితం. నాకు కూడా సక్సెస్‌ లేట్‌గానే వచ్చింది. చాలా సంవత్సరాల కష్టపడ్డ తర్వాత నాకు ఈ ట్రోఫీ వచ్చింది''అని భావోద్వేగానికి లోనయ్యారు.