ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా లో హీరోయిన్ ఫిక్స్..?

 కొరటాల శివ  దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 31 చిత్రాల ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో కొంతవరకు క్లారిటీ వచ్చేసింది.


ఈ రెండు సినిమాలు ఎన్టీఆర్ స్టామినాకి తగ్గట్టుగా హెవీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌గా తెరకెక్కనున్నాయని మేకర్స్ హింట్ ఇచ్చేశారు. అయితే, ఎన్టీఆర్ 31 సెట్స్‌పైకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, కేజీఎఫ్  చిత్రాలతో పాన్ ఇండియన్ రేంజ్ డైరెక్టర్‌గా పాపులారిటీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్  తెరకెక్కించబోతున్నారు. 2023, ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అవుతుందని చిత్రబృందం వెల్లడించింది. కాబట్టి, ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ గురించి అభిమానులు అంతగా మాట్లాడుకోవడం లేదు.ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్ 30 మీదే ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరిని మేకర్స్ ఎంపిక చేయనున్నారో.. అని చర్చలు మొదలయ్యాయి. ఆలియా భట్ ఎన్టీఆర్ 30లో హీరోయిన్ అని అంతకముందు వార్తలు వచ్చాయి. కానీ, పెళ్లి తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందని సమాచారం. దాంతో తారక్ సరసన పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లను పరిశీలించిన చిత్రబృందం, ఫైనల్‌గా 'లోఫర్' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన దిశా పటాని ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్‌గా మారిన దిశా, సోషల్ మీడియాలో హాట్ హాట్ బికినీ షోస్‌తో సెగలు పుట్టిస్తోంది. సినిమాలకంటే కూడా ఇలా సోషల్ మీడియాలో తన ఫొటోస్ షేర్ చేస్తూనే వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీని ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా ఎంచుకుంటే ప్రాజెక్ట్‌కు ప్లస్ అవుతుందని చెప్పుకుంటున్నారు.